వరుడికి బంపరాఫర్‌.. స్టేజిమీదే  ముద్దు పెట్టిన మరదలు

Bride Sister Kisses Groom on Wedding Stage Video Goes Viral - Sakshi

మన దేశంలో పెళ్లి వేడుక అంటే ఆ హాడావుడే వేరు. సంతోషం, సరదాలు, ఆటపట్టించడం, కన్నీళ్లు ఇలా రకరకాల ఎమోషన్స్‌తో జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో వివాహ వేడుక సందర్భంగా వరుడిని ఆటపట్టించడం ఆనవాయితీగా వస్తుంది. కాబోయే బావని మరదళ్లు, బావమరుదుల ఆటపట్టిస్తారు. కానీ ఇప్పుడు మనం చేప్పుకోబోయేది అంతకు మించిన సరదా. ఇక్కడ పెళ్లి కుమార్తె సోదరి ఏకంగా మంటంపంలో అందరి ముందు వరుడికి ముద్దు పెట్టేసింది. అనుకోని చర్యకు సదరు పెళ్లికుమారుడు బిత్తరపోయి.. బిక్కమొహం వేశాడు. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగింది.. ఏంటి అనే వివరాలు తెలియదు. నిరంజన్‌ ఎం 87 అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో స్టేజీమీద పెళ్లి కుమారుడు, కుమార్తె, మిగతా బంధువులు ఉంటారు. ఫోటోలు దిగే కార్యక్రమం జరుగుతుంటుంది. దానిలో భాగంగా పెళ్లి కుమార్తె చెల్లెలు కొత్త దంపతులతో ఫోటో దిగడం కోస వారి పక్కన కూర్చుంటుంది. ఫోటో తీస్తుండగా సడెన్‌గా పెళ్లి కుమార్తె సోదరి బావకు ముద్దు పెడుతుంది. అనుకోని ఈ సంఘటనకు వరుడు షాకవుతాడు. ఆమెను విడిపించుకునేందకు ప్రయత్నించినప్పటికి కుదరదు. పాపం మరదలి దెబ్బకు జడుసుకుంటాడు. ఆ అమ్మాయి చర్యకు అక్కడ ఉన్న వారందరు పడి పడి నవ్వుతారు. 

చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top