Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్‌ బయోటెక్‌

Bharat Biotech says Rs 150 per dose for Covaxin a non-competitive price' - Sakshi

నష్టానికి, కేంద్రానికి తక్కువ ధరకే అందిస్తున్నాం : భారత్‌ బయోటెక్‌

ఇకపై ప్రైవేట్‌లో ధరను తగ్గించలేం

నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో   ఈ ధరలు

సాక్షి, న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై  దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయెటెక్  ఉసూరు మనిపించింది. ప్రైవేట్‌లోఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది.  తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే  కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది. 

కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని కోవాగ్జిన్‌ తయారీదారు భారత్‌ బయోటక్‌  వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. అలాగే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే  ప్రైవేట్‌ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని  రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో  ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో  ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top