కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..

Belagavi: killed his brother on suspicion Affair With his wife - Sakshi

బనశంకరి: అనుమానం పెనుభూతమైంది. సొంత అన్ననే కడతేర్చేందుకు వుసిగొల్పింది. కాళ్లు పట్టుకుని వేడుకున్నా తన భార్యతో సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో సొంత అన్నను హత్య చేశాడు ఇక్కడ ఓ తమ్ముడు. ఈ ఘటన కర్ణాటక బెళగావి జిల్లా చిక్కోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

చిక్కోడి పట్టణంలో అక్బర్‌ షేక్‌ (36), అమ్జద్‌ షేక్ అన్నదమ్ములు. ఒకే అంతస్తులో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. అయితే అక్బర్‌ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తమ్ముడైన అమ్జద్‌లో నెలకొంది. దీంతో పలుమార్లు అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి.. అలాంటిదేం లేదని తేల్చారు కూడా. కానీ.. 

అక్బర్‌ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అమ్జద్‌లో నానాటికీ బలపడుతూ పోయింది. ఈ క్రమంలో.. అన్న అక్బర్‌ను లేకుండా చేయాలని అమ్జద్‌ పథకం రచించాడు. ఏకంగా ఓ కారు కొనుగోలు చేశాడు. శనివారం బైక్‌లో వెళ్తున్న అక్బర్‌ను కారుతో ఢీ కొట్టించాడు. యాక్సిడెంట్‌గా ఆ కేసు పోతుందని అనుకున్నాడు. అయితే యాక్సిడెంట్‌ చేసినా అక్బర్‌ చనిపోలేదని భావించి.. కారు దిగిన అమ్జద్‌ అక్బర్‌ వైపు వెళ్లాడు. తనకేం సంబంధం లేదని, వదిలేయాంటూ కాళ్లు పట్టుకున్నాడు అక్బర్‌. అయినా వినకుండా ఓ ఆయుధంతో అన్నను హతమార్చాడు. ఆపై నేరుగా చిక్కోడిపోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు అమ్జద్‌. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top