Sakshi News home page

సామ్రాజ్య భారతి: 1916/1947

Published Sat, Jul 30 2022 11:44 AM

Azadi Ka Amrit Mahotsav: Samrajya Bharati 1916 to 1947 - Sakshi

ఘట్టాలు
భారత జాతీయ కాంగ్రెస్, ఆలిండియా ముస్లిం లీగ్‌ ల మధ్య ‘లక్నో ఒప్పందం’.  ప్రాదేశిక శాసనసభల్లో తమ పార్టీల తరఫున అల్పసంఖ్యాక మతాల వారికి తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించేందుకు అంగీకరిస్తూ ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ఇది. జాతీయ కాంగ్రెస్‌ తరఫున బాల గంగాధర తిలక్‌; జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్‌.. ఆ రెండు పార్టీల తరఫున జిన్నా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

చట్టాలు
ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్, 
హిందూ డిపోజిషన్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌

జననాలు
జగ్జీత్‌సింగ్‌ ఆరోరా : ఇండియన్‌ ఆర్మీ జనరల్‌ (పంజాబ్‌); బిస్మిల్లాఖాన్‌ : షెహనాయ్‌ విద్వాంసులు (బిహార్‌); హర్‌కిషన్‌సింగ్‌ సుర్జీత్‌: కమ్యూనిస్టు యోధుడు (పంజాబ్‌); ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి : కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని (తమిళనాడు); దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ : ఆర్‌.ఎస్‌.ఎస్‌.నేత, హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త (ఉత్తర ప్రదేశ్‌); జైల్‌సింగ్‌: భారతదేశ 7వ రాష్ట్రపతి (పంజాబ్‌); బీజూ పట్నాయక్‌ : ఒరిస్సా ముఖ్యమంత్రి; స్వామి చిన్మయానంద : ఆధ్యాత్మిక గురువు (కేరళ); ఎస్‌.ఓబుల్‌రెడ్డి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్, ఆం.ప్ర., గుజరాత్‌ హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌.

Advertisement

What’s your opinion

Advertisement