Azadi Ka Amrit Mahotsav Economic Reforms Collecting Taxes - Sakshi
Sakshi News home page

Azadi Ka Amrit Mahotsav: ఆర్థిక సంస్కరణలు ... పన్ను దన్ను

Jul 15 2022 3:05 PM | Updated on Jul 15 2022 4:14 PM

Azadi Ka Amrit Mahotsav Economic Reforms Collecting Taxes - Sakshi

భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ఆర్థిక వనరుల్లో ప్రజలు, సంస్థలు చెల్లించే పన్నులు కీలకమైనవి. పన్నుల విధానాల్లో మార్పుల కోసం అప్పట్లో రాజా చెల్లయ్య కమిటి కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా అవి పన్ను కట్టేవారిని వర్గీకరించిన సిఫారసులు. సంపన్నులు ఇంత పన్ను కట్టాలి, ఆదాయ పరంగా పైనున్న వారు ఇంత కట్టాలి అని శాతాలు నిర్ణయించారు. ఏమైనా దేశానికి చేవనిచ్చే పన్నులు, వ్యక్తిగతంగా పన్ను కట్టవలసిన వాళ్ల వెన్ను విరుస్తున్నాయన్న అసంతృప్తి దశాబ్దాల నుంచి ఉన్నదే.

అదే సమయంలో కంపెనీలపై ఉన్న కార్పోరేట్‌ పన్ను భారాన్ని ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ, వ్యక్తిగత పన్నును పెంచుతూ వస్తోంది. కంపెనీలకు పన్నులు తగ్గిస్తే అవి ఉద్యోగాల కల్పనకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశించినా, ఆ ఆశ ఫలించలేదు. పైగా బ్యాంకు లకు కట్టాల్సిన రుణ బకాయిల నుంచి కంపెనీలు ఊపిరి పీల్చుకు నేందుకు ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తూ వస్తోంది.

ప్రతిఫలంగా కంపెనీల నుంచి ప్రభుత్వానికి చేకూరున్న ఆర్థిక దన్నేమీ గణనీయంగా కనిపించకపోవడమే కాకుండా.. ఆ లోటు సామాన్య పౌరులు పరోక్షంగా చెల్లించే పన్నులతోనే పూడ్చు కోవలసిన పరిస్థితి  ఏర్పడు తోంది. అందుకే రానున్న సంవత్సరాలలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వస్తుసేవల వినిమయానికి గిరాకీ తెచ్చేందుకు మన ఆర్థికవేత్తలు.. వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల్ని, జీఎస్టీలను సరళీకరించి ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు.  

(చదవండి: కోటప్పకొండ దొమ్మీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement