చౌక్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 150 దుకాణాలు దగ్ధం.. వీడియో వైరల్..

Assam Chowk Bazar Fire Accident Shops Gutted - Sakshi

దిస్పూర్‌: అస్సాం జోర్‌హట్‌లోని చౌక్ బజార్‍లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం జరిగిన ఈ ఘటనలో  150 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 20 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి.

ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అగ్నికీలలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. ఓ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఆ మంటలు క్షణాల్లోనే ఇతర దుకాణాలకు వ్యాపించినట్లు చెప్పారు.
చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పురిజర్వ్..

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top