ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే..

Anand Mahindra Shares Old Couple Try To Hoists Flag Emotional Post - Sakshi

వైరల్‌: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్‌ ఘర్‌ తిరంగా పిలుపు గ్రాండ్‌ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్‌ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. 

స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్‌గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్‌ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. 

ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. 

ఇదీ చదవండి: భారత్‌కు పాక్‌ మ్యూజిషియన్‌ ఊహించని కానుక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top