బర్డ్‌ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్‌ సెంటర్‌లు బంద్‌

Amid Bird Flu Scare Chicken Shops Closed For 15 Days in MP Mandsaur - Sakshi

భోపాల్‌: కరోనా వైరస్‌ ఇంకా కంట్రోల్‌ కాలేదు. మరో వైపు బర్డ్‌ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్‌ మాంద్సౌర్‌లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  మంద్సౌర్‌ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్‌ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్‌ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్‌ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్‌ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ మాట్లాడుతూ ‘ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ  రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? )

2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్‌లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్‌లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో  కేరళలోని కొట్టాయం‌, అలపూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top