Covid19: 63,509 New Corona Positive Cases In India - Sakshi
Sakshi News home page

Oct 14 2020 9:57 AM | Updated on Oct 14 2020 2:56 PM

63509 New Corona Cases Recorded In India - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 72 లక్షల మార్కును దాటింది. గడిచిన 24గంటల్లో 63,509 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 72,39,389కి చేరింది. నిన్న ఒక్క రోజే 730 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,10,586 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,26,876 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 63,01,927మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో రికవరీ రేటు 86.78 శాతంగా.. మరణాల రేటు 1.53శాతంగా ఉంది. చదవండి : రెండోసారి కరోనా.. మరింత తీవ్రం

Advertisement
 
Advertisement
Advertisement