ఢిల్లీలో కొత్తగా 3,827 పాజిటివ్‌ కేసులు | 3827 New Corona Virus Positive Cases Recorded In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కొత్తగా 3,827 పాజిటివ్‌ కేసులు

Sep 25 2020 8:12 PM | Updated on Sep 25 2020 8:16 PM

3827 New Corona Virus Positive Cases Recorded In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,827 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 64 వేలు దాటింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 24మంది మృత్యువాత పడగా ఇప్పటివరకు 5,147మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 4,061మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వగా.. మొత్తం 2,28,436 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,867గా ఉంది.

చదవండి : మహమ్మారి గురించి మీకేం తెలుసు!?

Advertisement
 
Advertisement
Advertisement