ఎకరా భూమి రిజిస్ట్రేషన్‌కు మూడు రోజుల కిందట స్లాట్ బుక్ చేసుకుంటే అధికారుల తప్పిదం కారణంగా అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సవరణకు ముందు స్లాట్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లించినందున వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయాలి. అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. అకస్మాత్తుగా భూ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి రైతులపై అదనపు భారం మోపడం సమంజసం కాదు.
– హుస్సేన్‌సాబ్, రైతు, ఎల్లంపల్లి
రైతులపై అదనపు భారం..
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో సామాన్య రైతు నడ్డి విరిచింది. చార్జీలు పెరగకముందు స్లాట్ బుక్ చేసుకున్నా అధికారులు అందుబాటులో లేక అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదివరకే స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు పాత రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
– బాబు, రైతు, పెద్దకడ్మూర్
సర్వర్ సమస్యతో ఆలస్యం..
సర్వర్ మొరాయిస్తుండటంతో రెండురోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. గురువారం ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు చేయలేదు. పెరిగిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రావడంతో పెండింగ్‌లో ఉన్న 30కి పైగా రిజిస్ట్రేషన్లు కొత్త చార్జీలతోనే చేశాం. రైతులు అదనపు చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
– కాళప్ప, ఇన్‌చార్జ్ తహసీల్దార్, నర్వ
●


