అసంపూర్తిగానే.. ఆకాంక్ష | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తిగానే.. ఆకాంక్ష

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

నారాయణపేట

కేఎల్‌ఐతో మహర్దశ పట్టినా నామమాత్రంగానే సాగు

భారీ సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాల్వలు లేకపోవడమే కారణం

వరప్రదాయినిగా నిలిచిన జూరాలలో పేరుకున్న పూడిక

నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పనులు పెండింగ్‌లోనే..

పుష్కర తెలంగాణలో సాగు నీళ్ల కోసం తప్పని నిరీక్షణ

నేడు, రేపు సీఎం రేవంత్‌, మంత్రుల ప్రాజెక్ట్‌ల సందర్శన

.. ప్లాస్టిక్‌ నిషేధం

పాలమూరు సమీపంలోని పర్వతాపూర్‌ మైసమ్మ అడవిని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

–8లో u

అడుగులు పడినా పూర్తికాని ‘పాలమూరు’

మ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఐదు (నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్‌ 16న నార్లాపూర్‌ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి పంప్‌ను ప్రారంభించారు.

రిజర్వాయర్ల వారీగా..

నార్లాపూర్‌: కొల్లాపూర్‌ మండలంలో 8.61 టీఎంసీల సామర్థ్యం గల నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయింది. పంప్‌ హౌస్‌ పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌ వరకు కెనాల్‌ నిర్మించాల్సి ఉండగా.. 400 మీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పంప్‌హౌస్‌ కోసం 400 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్‌ కింద సబ్‌ కెనాళ్లు, బ్రాంచ్‌ కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్‌ చేయాల్సి ఉంది. పంప్‌ హౌస్‌ వద్ద 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం రెండు మోటార్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మరో మూడింటిని ఏర్పాటు చేసింది. ఇంకా నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యూ

Advertisement
 
Advertisement
Advertisement