మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండు హెలీప్యా డ్లు ఏర్పాటు చేసి రహదారి సిద్ధం చేయాలని అర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. అగిమాపకశాఖ అధికారులు రెండు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత అధికారులు ఆహార తనిఖీలు చేపట్టాలన్నారు. భోజనం, వసతి ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు సమకూర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ వినీత్, అడిషనల్ ఎస్పీ వాసుదేవారెడ్డి, శ్యాం, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ తదితర అధికారులు ఉన్నారు.


