● నేడు కలెక్టరేట్‌లో
రాష్ట్ర అవతరణ వేడుకలు
● హాజరుకానున్న
మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నా రు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రగతి, సంక్షేమ విజయాలను ప్రతిభింబించేలా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక దిశానిర్దేశంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం 8 గంటలకు మంత్రి వాకిటి శ్రీహరిచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వంద నం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం, తెలంగాణ సాధన చరిత్రను ప్రతిభింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకల్లో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


