ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

నారాయణపేట: అన్ని శాఖల అధికారు లు ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తూ 23 ఫిర్యాదులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

● జిల్లాకేంద్రంలో నిర్మాణాలు పూర్తయిన మూడు ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ప్రా రంభించారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చ టించి.. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్యాభ్యాసం, జీవన విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా సత్యయాదవ్‌, హౌసింగ్‌ పీడీ శంకర్‌ నాయక్‌, ము న్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల,కౌన్సిలర్లు మహే శ్‌, గొల్ల రవితేజ యాదవ్‌,రాజేశ్‌ ఘట్‌, హౌసింగ్‌ ఏఈ గౌస్‌, వార్డు ఆఫీసర్‌ దేవరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement