నారాయణపేట: నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా సక్రియా నాయక్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు గద్వాల జిల్లా అలంపూర్ వ్యవసాయ అభివృద్ధి అధికారి (ఏడీఏ)గా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఇది వరకు నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన జాన్ సుధాకర్ పదోన్నతిపై జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సక్రియ నాయక్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అధికారిక విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లు లేదా రశీదు తీసుకోవాలని సూచించారు.


