సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

Mar 19 2026 8:47 AM | Updated on Mar 19 2026 8:47 AM

కోస్గి రూరల్‌: సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హల్‌లో నిర్వహించిన మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ నాగులపల్లి నరేందర్‌, ఏడీఏ రామకృష్ణ తదితరులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సిరిధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. సిరిధాన్యాల సాగుతో రైతులకు అధిక లాభాలు రావడంతో పాటు మానవళికి పోషకాలతో కూడిన ఆహారం అందుతుందన్నారు. అనంతరం రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇతర సిరిధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించి.. రైతులందరికీ వాటి రుచి చూయించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమా లు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమా ర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, మద్దూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీల్లికర్‌ సరస్వతీ జనార్దన్‌, ఏఓ రేష్మారెడ్డి, కొత్తపల్లి రమేశ్‌, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్‌ భానునాయక్‌, మాస్టర్‌ శ్రీనివాస్‌, ఓంప్రకాశ్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement