సంక్రాంతి సందడి
● రంగుల్లులతో శోభిల్లిన లోగిళ్లు
● ఇంటింటా కలకూరగాయ.. సద్ద, నువ్వుల రొట్టెలు
నారాయణపేట: సరదాల సంక్రాంతి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. వాటిలో కొత్తగా పండించిన ధాన్యం, గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. భోగభాగ్యాలు కలగాలని భోగి మంటలు వేయగా.. యువత, చిన్నారులు సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడక్కడా బొమ్మల కొలువులను ఏర్పాటుచేశారు. మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటింటా సద్ద, నువ్వుల రొట్టెలు, కలకూరగాయలతో ప్రత్యేక వంటకాలను తయారుచేసి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరగించారు. చిన్నారులు పతంగులను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఏ పల్లెలో చూసినా యువకుల ఆటపాటలు, బంధుమిత్రుల రాకలతో సందడిగా కనిపించాయి. ఇక గురువారం సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. మూడోరోజు శుక్రవారం కనుమ సందర్భంగా పశువులకు పూజలు చేసి.. విందు, వినోదాలతో సంబరాలు జరుపుకోనున్నారు. పండగ సందర్భంగా పలు గ్రామాల్లో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
వాయినం ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు
సంక్రాంతి సందడి
సంక్రాంతి సందడి
సంక్రాంతి సందడి
సంక్రాంతి సందడి
సంక్రాంతి సందడి


