ట్యాంకు నీళ్లతో స్నానం చేస్తాం
ఎస్సీ వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ గ్రౌండ్ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నా. హాస్టల్‌లో గీజర్ లేదు. బోరు నుంచి ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తారు. ఆ నీటితోనే స్నానం చేస్తాం. చలికాలం కావడంతో స్నానం చేసేందుకు వణికిపోతున్నాం. హాస్టల్‌లో గీజర్లు ఏర్పాటు చేయాలి. – నరేందర్, విద్యార్థి,
ఎస్సీ వసతిగృహం, నారాయణపేట
పైకప్పు పెచ్చులూడుతుంది..
మాది నారాయణపేట మండలంలోని అభంగాపూర్. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో ఉండి రవితేజ హైస్కూల్‌లో 9వ తరగ తి చదువుతున్నా. హాస్టల్ భవనం పాతది కావ డంతో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు కింద పడుతుందో అనే భయం ఉంది. చలి తీవ్రత కూడా అధికంగా ఉంది.
– రాజు, విద్యార్థి, ఎస్సీ వసతిగృహం, నారాయణపేట
రోజు వణికిపోతున్నాం..
రోజు ఉదయాన్నే స్నానం చేయాలంటే వణికిపోతున్నాం. కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వచ్చాక స్నానాలు చేస్తున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం. ఆనంద నిలయంలో గీజర్లు లేదా హీటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– వెంకటేశ్, విద్యార్థి, ఆనంద నిలయం, మక్తల్
●
ట్యాంకు నీళ్లతో స్నానం చేస్తాం
ట్యాంకు నీళ్లతో స్నానం చేస్తాం


