ప్రశాంతంగా నీట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

బొమ్మలసత్రం/పాణ్యం: వైద్యవిద్యలో స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌–పీజీ ప్రవేశ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఏవీఆర్‌ ఎస్‌వీఆర్‌, రామకృష్ణ, ఆర్‌జీఎం, శాంతిరామ్‌ కళాశాలల్లో నిర్వహించిన పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో 295 మందికి గాను 275 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరయ్యారు. శాంతిరామ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలో 250 మందికి గాను 236 మంది మాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. ఎస్పీ సునీల్‌ షోరాణ్‌, అడిషినల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో భద్రతా ఏర్పా ట్లు కట్టదిట్టంగా అమలు చేశామని, హాల్‌ టికెట్లు తనిఖీలు వంటి విధానాలు సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. డ్రోన్‌ పెట్రోలింగ్‌తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement