వెలుగోడు: సెప్టెంబర్ 1న వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వెలుగోడు పట్టణంలో ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది ట్రాక్టర్ యజమానులకు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లొద్దంటూ నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్లను సీజ్ చేస్తామని, కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రైతులతో కలిసి వెలుగోడు రిజర్వాయర్‌ను సందర్శించేందుకు అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.


