సూసైడ్‌ స్పాట్స్‌గా మారిన పుణ్యక్షేత్రాలు | - | Sakshi
Sakshi News home page

సూసైడ్‌ స్పాట్స్‌గా మారిన పుణ్యక్షేత్రాలు

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

సూసైడ్‌ స్పాట్స్‌గా మారిన పుణ్యక్షేత్రాలు అన్ని కోణాల్లో దర్యాప్తు

గతంలో బావులు, చెరువుల్లో దూకడం, ఆ తర్వాత ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకి చనిపోవడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. ఇలాంటి వాటిని ట్రెండ్‌ అంటారు. కాలానుగుణంగా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు సూసైడ్‌ స్పాట్స్‌గా మారుతుంటాయి. ఇప్పుడు పుణ్యక్షేత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ఎప్పుడో ఎవరో కొందరు పుణ్యక్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్నారన్న మీడియా, సోషల్‌ మీడియాలో చూసి ఉంటారు. వీరికేదైనా ఆత్మహత్య చేసుకోవాలన్న బలమైన తలంపు వచ్చినప్పుడు వారు కూడా అలాంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. – డాక్టర్‌ ఎన్‌.నాగేశ్వరరావు,

సైకియాట్రి హెచ్‌ఓడీ, కర్నూలు జీజీహెచ్‌

శ్రీశైలంలో చోటుచేసుకున్న ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం. బత్తలపల్లి పోలీసులతో కూడా మాట్లాడాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. సత్రం నిర్వాహకులతో కూడా మాట్లాడాం, సత్రం రిజిస్టర్‌, రికార్డులు, సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నాం.

– రామాంజినాయక్‌, ఆత్మకూరు డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement