50 కిలోల పంచలోహ విగ్రహం విరాళం | - | Sakshi
Sakshi News home page

50 కిలోల పంచలోహ విగ్రహం విరాళం

Aug 28 2026 2:39 AM | Updated on Aug 28 2026 2:39 AM

జూపాడుబంగ్లా: తాటిపాడు గ్రామ ంలోని వీరభద్రస్వామి ఆలయానికి గురువారం 50 కిలోల పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, సరోజినీదేవి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాసరావు, వెంకటరమణరావు, కుమా ర్తె ధనలక్ష్మి రూ.1.45 లక్షల విలువైన 50 కిలోల పంచలోహ లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని అందజేశారు. తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పెద్దలు హరీష్‌రెడ్డి, అంబిరెడ్డి, అర్చకులు రాజేష్‌, మురళీమోహన్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement