పోలీసు దిగ్బంధంలో పోతిరెడ్డిపాడు.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు దిగ్బంధంలో పోతిరెడ్డిపాడు..

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

వైఎస్సార్‌సీపీ నాయకులు ఎట్టిపరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లకూడదనే కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్‌ అధ్వర్యంలో పోలీసులు పోతిరెడ్డిపాడుకు వెళ్లే దారుల్లో బారికేడ్లతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకున్నారు. పాములపాడు మీదుగా ఎస్సారెమ్సీ కాల్వ ఎడమగట్టు వెంట పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్దకు చేరుకునేందుకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వారి వాహనాల్లో కాల్వ 0.6 కిలో మీటరు వద్దకు చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రైతులతో కాసేపు మాట్లాడి, సమస్యలను తెలుసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కడప జిల్లా ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్‌ సురేంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, నాయకులు మాసీమబాబు, గుండం సూర్య ప్రకాశ్‌రెడ్డి, సూర్య నారాయణరెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్స్‌ సాయినాథ్‌రెడ్డి, షేక్‌ బాబులాల్‌, సంయుక్త కార్యదర్శులు గంధం రాఘవరెడ్డి, జెడ్పీటీసీలు పోచా జగదీశ్వరరెడ్డి, పర్వత యుగంధర్‌రెడ్డి, మండలాల కన్వీనర్లు పుల్యాల నాగిరెడ్డి, లోకేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, స్థానిక నాయకులు నాగార్జునరెడ్డి, నరేష్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తిరుమల్లేష్‌రెడ్డి, మద్దిలేటిరెడ్డి, వెంకటరమణ, చిన్నమల్లయ్య, సుంకన్న, మల్లారెడ్డి, అశోక్‌రెడ్డి, సురేష్‌, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement