యాగంటిపల్లె కేవీకేకు నాస్‌–ధనుకా అవార్డు | - | Sakshi
Sakshi News home page

యాగంటిపల్లె కేవీకేకు నాస్‌–ధనుకా అవార్డు

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

బనగానపల్లె రూరల్‌: యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి నాస్‌ ధనుకా అవార్డు వచ్చినట్లు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ధనలక్ష్మీ శుక్రవారం తెలిపారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (నాస్‌) న్యూఢిల్లీ, ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌లు సంయుక్తంగా ఈ అవార్డును ఇస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌–33వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎంఎల్‌ జట్‌, మరికొందరి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఈ పురస్కారం అందుకోవడం యాగంటిపల్లె కేవీకేకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధి బాధ్యత మరింత పెంచిందని తెలిపారు.

279 మంది విద్యార్థులు

గైర్హాజరు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలోని 18 కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ను ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంగ్లిష్‌ పరీ క్షకు 475 మంది విద్యార్థులకు గాను 196 మంది హాజరు కాగా 279 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీంలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు.

అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వకాలు

టాస్క్‌ఫోర్స్‌: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడానికి పలు మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకున్నారు. అదీ చాలక ఇసుక వ్యాపారం చేస్తున్నారు. వీటికి అదనంగా ఐరన్‌ ఓర్‌ తవ్వకాలు చేపడుతున్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, తవిసికొండ, పాపాసాని కొట్టాల, రేపల్లె, వీరాయపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వుతున్నారు. ఇందుకోసం జేసీబీ, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నాయకుల తవ్వకాలకు సహకరించడంతోపాటు వారు అనుకున్న ప్రాంతాలకు ఐరన్‌ఓర్‌ను తరలించే ప్రకియలో కొందరు అధికారులు పాలు పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

పట్టా ఇప్పించమంటే.. స్థలాన్ని కబ్జా చేశారు!

న్యాయం చేయాలని బాధిత

కుటుంబం ఆందోళన

నందికొట్కూరు: తాము కొనుగోలు చేసిన స్థలానికి పట్టా ఇప్పించమంటే టీడీపీ నాయకుడు అబ్దుల్లా కబ్జా చేశాడని పేద కుటుంబం సభ్యులు శుక్రవారం స్థలం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాళీ జాగా కనిపిస్తే టీడీపీ నాయకుడి కబ్జా చేస్తున్నారని, ఒక కుటుంబం ఏకంగా పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించిందన్నారు. ఒక మహిళ బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారని, ఈ సంఘటన మరవకముందే తమ స్థలం కబ్జా చేశారని లక్ష్మిదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తాము 2008లో 451 నంబరు గల ప్లాట్‌ను కొనుగోలు చేశామని, పట్టా ఇప్పించమని కౌన్సిలర్‌ భర్త అబ్దుల్లాను ఆశ్రయిస్తే కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటున్నర స్థలాన్ని ఇతరులకు విక్రయిస్తే బిల్డింగ్‌ కూడా నిర్మించారని, మిగతా సెంటున్నర స్థలం ఆక్రమించి స్వాధీనంలో ఉంచుకున్నారన్నారు. ఖాళీ స్థలమైనా తమకు అధికారులు ఇప్పించాలని కోరారు. పేదల స్థలాలను కబ్జా చేస్తున్న అబ్దుల్లాపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement