అధికారుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం | - | Sakshi
Sakshi News home page

అధికారుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

నిబంధనల మేరకే అఫ్లియేషన్‌

ఆర్‌యూ బీఎడ్‌ కళాశాలల అఫ్లియేషన్‌లో గందరగోళం

సొంత భవనాలు లేని కళాశాలకు అఫ్లియేషన్‌

ఎన్‌సీటీఈలో కళాశాల అడ్రస్‌ ఒక చోట.. చూపించేది మరో చోట

యాజమాన్యాలతో వర్సిటీ అధికారుల చెట్టాపట్టాల్‌

ముడుపులకు తలొగ్గి అఫ్లియేషన్‌కు రెకమెండ్‌ చేస్తున్న కమిటీలు

ఓర్వకల్లు: మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, ఆంజనేయస్వామి ఆలయంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో దళితులకు శుక్రవారం ఆలయ ప్రవేశం కల్పించారు. గొందిపర్ల గ్రామానికి చెందిన మాలతి ఐదు నెలల క్రితం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన సమయంలో ఆలయ పూజారి కులవివక్షతో దూషించిన విషయం తెలిసిందే. ఆవెమె అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆ మేరకు కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్‌, బాధితురాలు బీజేపీ జిల్లా కార్యదర్శి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యురాలు గొందిపర్ల మాలతి, ఆమె భర్త రామాంజనేయులుతో పాటు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగరాజు సమక్షంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆలయ ప్రవేశం చేసే హక్కు వుందన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం సామాజిక సమానత్వానికి నిదర్శనమని, కులవివక్షతకు సమాజంలో ఎలాంటి స్థానం లేదని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, బీజేపీ నాయకులు, దళిత సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు, దళితులు పాల్గొన్నారు.

అంతా ‘మామూళ్లే’

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌ ప్రక్రియ గందరగోళాన్ని తలపిస్తోంది. వర్సిటీ అఽధికారులతో కొన్ని కళాశాలల యాజమాన్యాల లోపాయకారి ఒప్పందం, అఫ్లియేషన్‌ కమిటీలతో లాబీయింగ్‌, యాజమాన్యాల రహస్య సమావేశాలు, అమ్యామ్యాల అప్పగింతలు వెరసి బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్‌ను కానిచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్‌యూ పరిఽఽధిలో 2026–27 విద్యా సంవత్సరానికి 50 కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇచ్చేందుకు కమిటీలను వేశారు. ఆర్‌యూ ప్రొఫెసర్లతో పాటు ఇతర వర్సిటీల నుంచి కొందరు ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు గత మూడు రోజులుగా కళాశాలలను సందర్శిస్తున్నాయి. కమిటీలు తూతూ మంత్రంగా సందర్శించడం.. అఫ్లియేషన్‌కు రెకమెండ్‌ చేయడం సర్వసాధారణంగా జరి గిపోతోంది. వర్సిటీ ఉన్నతాధికారులేమో ఫిర్యా దులు, ఆరోపణలు పట్టించుకోకుండా ‘కమిటీలు రెకమెండ్‌ చేశాయి.. మేము అఫ్లియేషన్‌ ఇచ్చేస్తున్నాం’ అని చెప్పడం పరిపాటిగా మారింది. లోపాలను ఏమాత్రం సరిచేయకుండా నెపాన్ని కమిటీలపైకి నెట్టేస్తున్నారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో వర్సిటీ అధికారులు భాగస్వామ్యంగా ఉన్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అదీ కాక ఎలాంటి బిల్డింగ్‌లు లేని కళాశాలల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరగడం పలు విమర్శల కు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీలు ఎన్ని కళాశాలలకు రెకమెండ్‌ చేస్తారో వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్ని కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇస్తారో మరో వారం రోజుల్లో తేలనుంది.

కమిటీలదే ప్రధాన పాత్ర ..

వర్సిటీ పరిధిలోని కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇవ్వడానికి అఫ్లియేషన్‌ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కమిటీలు కళాశాలలను ఫిజికల్‌గా సందర్శించి ఎన్‌సీటీఈ నిబంధనలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగా మాత్రమే వర్సిటీ సీడీసీ విభాగం, వర్సిటీ ఉన్నతాధికారులు అఫ్లియేషన్‌ ఇస్తారు. అయితే యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్న కమిటీలను ఏర్పాటు చేయించుకొని కళాశాలలను తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకుని వ్యవహారం నడిపించారు. కమిటీ సభ్యులు ఎన్‌సీటీఈ నిబంధనలను కమిటీ సభ్యులు పరిశీలిస్తే సుమారు 20 కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇచ్చే పరిస్థితి ఉండదదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆ పది కళాశాలలు ఎక్కడో..

వర్సిటీ పరిధిలో అఫ్లియేషన్‌కు 50 కళాశాలలకు దరఖాస్తు చేసుకోగా అందులో 10 కళాశాలలకు భవనాలు లేవనేది బహిరంగ రహస్యమే. నందికొట్కూరులో రెండు, పంచలింగాలలో రెండు, కర్నూలులో మూడు, నన్నూరులో ఒకటి, డోన్‌లో రెండు కళాశాలల ఉన్నట్లు పేపర్లలో మాత్రమే అడ్రస్‌ ఉంటుంది. ఆ అడ్రస్‌కు వెళితే అక్కడే ఏదో ఒక షాపింగ్‌ మాల్‌, ఇళ్లు, మల్టీపర్పస్‌ బిల్డింగ్స్‌ ఉంటాయి. వీటిని చూస్తే అఫ్లియేష్‌ కమిటీలు అఫియేషన్‌కు రెకమెండ్‌ చేస్తున్నారంటే ఎంతలా లాబీయింగ్‌ జరుగుతుందో, ఎన్ని ముడుపులు ముడుతున్నాయో అనే సందేహం వ్యక్తమవుతోంది.

నిబంధనల మేరకే బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇస్తాం. అఫ్లియేషన్‌ కమిటీలు సరైన నివేదికలే ఇస్తాయి. ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఏవైనా ఫిర్యాదులు, ఆరోపణలు ఉంటే మరో కమిటీ ద్వారా కళాశాలలను సందర్శించి నివేదిక తెప్పించుకుంటాం. తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలు, లాబీయింగ్‌లకు ఆస్కారం ఉండదు. పారదర్శకంగా అప్లియేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తాం.

– ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు,

వైస్‌ చాన్స్‌లర్‌, ఆర్‌యూ

Advertisement
 
Advertisement
Advertisement