వీవీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వీవీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

దొంగలనుకున్నారు..కానీ!

కర్నూలు(సెంట్రల్‌): రాయలసీమ యువజన సంఘం నాయకుడు వీవీ నాయుడు భూ పంచాయతీల్లో తలదూర్చడం, ఆర్‌డీఓ కార్యాలయ సిబ్బందిని భయపెడుతున్నాడని కర్నూలు ఆర్‌డీఓ కె.సందీప్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన మాజీ సైనికుడు విజయ్‌ని వీవీనాయుడు ఓ పంచాయితీలో కలుగజేసుకొని వేధిస్తున్నారని కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి వీవీనాయుడుకు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని తెలిందన్నారు. అయినా అతను మాత్రం అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపణలు చేయడం, తన కార్యాలయ అధికారులను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రాయలసీమ యువజన సంఘం నాయకులు సోషల్‌ మీడియాలో ఆర్‌డీఓ పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

స్పెషల్‌ సప్లిమెంటరీకి

దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో 2019 యూజీ(డిగ్రీ)లో చేరి ఒక సబ్జెక్టు ఫెయిలైన అభ్యర్థులకు ఒక అవకాశం ఇస్తూ స్పెషల్‌ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకటబసవరావు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2019లో యూజీ (డిగ్రీ) చేరిన విద్యార్థులు కోర్సు మొత్తంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన వారు ఈ ఎగ్జామ్‌కు అర్హులని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2023లో యూజీ (డిగ్రీ)లో చేరి 5వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ పరీక్ష నిర్వహించటానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు.

దొర్నిపాడు: పాతసామాన్లు సేకరించే వారి ముసుగులో వచ్చి ఇటీవల కొందరు చోరీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బుర్రారెడ్డిపల్లె గ్రామంలో కొంతమంది ఆటోలో వచ్చి ఇంటి పరిసరాల్లో ప్లాస్టిక్‌, ఇనుప వంటి పాత సామాన్లను సేకరించుకునే పనిలో నిమగ్నం అయ్యారు. వీరు దొంగలని గ్రామస్తులు భావించి.. గ్రామంలోని విద్యుత్‌ స్తంభానికి ఇద్దరు వ్యక్తులను తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకోని వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుక వెళ్లారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ వారిని పూర్తి స్థాయిలో విచారించారు. వారు దొంగలు కాదని భిక్షాటన చేస్తూ పాతసామాన్లను సేకరించి అమ్ముకొని జీవనం సాగించే వారని నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement