ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ‘అశోక’కు అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ‘అశోక’కు అరుదైన గుర్తింపు

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

కర్నూలు సిటీ: ప్రతిష్టాత్మక ఐఐఆర్‌ఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌) ఇటీవల విడుదల చేసిన 2026 ఇంజినీరింగ్‌ కళాశాలల ర్యాంకింగ్‌లో కర్నూలుకు చెందిన అశోక ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ జాతీయస్థాయిలో 47వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. శుక్రవారం అశోక మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ ఆడిటోరియంలో అశోక్‌ ఎక్సలెన్స్‌ కాంక్లేవ్‌ – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్‌ఏఏఎస్‌, ఇంటర్న్‌ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌షిప్‌ యూనివర్సిటీస్‌, ఎర్నెస్ట్‌ యంగ్‌ (చైన్నె) మేనేజర్‌ శ్రీ హితేష్‌ శర్మ, వరల్డ్‌ ఏఐ గవర్నెన్స్‌ చీఫ్‌ ఏఐ అడ్వైజర్‌–ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌ (హైదరాబాదు) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గుండాల నాగరాజులు ముఖ్య అతిథులుగా హాజరై ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథులతో జరిపిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ ఎంపిక ప్రక్రియ, కళాశాలల మూల్యాంకన విధానం, విద్య నాణ్యత, పరిశోధన, పరిశ్రమల అనుసంధానం, ప్లేస్‌మెంట్లు, మౌలిక సదుపాయాల వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఎలా నిర్ణయిస్తారనే విషయాలపై కార్యక్రమంలో చర్చించారు. కార్యక్రమంలో అశోక కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.నవీన్‌, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ శివకుమార్‌, మగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement