అమ్మ.. అనాథగా ! | - | Sakshi
Sakshi News home page

అమ్మ.. అనాథగా !

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

● కలెక్టరేట్‌లో వదిలి వెళ్లిన కుటుంబ సభ్యులు

వృద్ధురాలు ఆకలితో అల్లాడిపోతోంది. పిల్లలను తలచుకుంటూ బోరున విలపిస్తోంది. బువ్వ పెట్టమని అటుగా వెళ్లిన వారిని బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దోమలతో నరకం చూస్తోంది. ఇదంతా ఇక్కడో కాదు. జిల్లా పరిపాలన భవనం కలెక్టరేట్‌లోనే. ఓ వృద్ధురాలు అనాథగా అలమటిస్తోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులే శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వృద్ధురాలి దీన గాథ వినడానికి అధికారులెవరూ ముందుకు రాలేదు. ఆమె ఆర్తనాదాలు వినిపించనట్లు వెళ్లిపోయారు. తన ఊరు, పేరు కూడా చెప్పలేకపోవడంతో మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. – కర్నూలు(సెంట్రల్‌)

Advertisement
 
Advertisement
Advertisement