● ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
నంద్యాల: వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డిని పోలీసులు గురువారం హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో శిల్పాచక్రపాణిరెడ్డి ఆత్మకూరు కు వెళితే ఘర్షణలు జరుగుతాయని, నంద్యాల నుంచి పక్కకు వెళ్లకుండా శిల్పాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకున్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నివాస గృహంలో ఉన్న శిల్పాచక్రపాణిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి సీఐ, ఎస్‌ఐలతో బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పోలీసులు ఎక్కడా ఈ కార్యక్రమం జరగకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వైఎస్సార్‌సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చా రు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మహానంది, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరగనివ్వలేదు. శిల్పాచక్రపాణిరెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేశార ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు నంద్యాలకు వస్తుండగా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి
ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులు, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పాచక్రపాణిరెడ్డి, శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాలు గురువారం ఎస్పీ సునిల్‌షెరాన్‌ను కలిసి వివరించారు. సంఘటన ఎలా జరిగింది, ఎవరు ప్రోత్సహించారు వంటి వివరాలను ఎస్పీకి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గం జరగకుండా పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారని వివరించారు. ఈనెల 8, 9, 12 తేదీల్లో శ్రీశైలం నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు జరుపుకొనే విధంగా అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
అభివృద్ధి అంటే ఇదేనా?
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, దాడులు చేస్తున్నారని, ఇదేనా అభివృద్ధి అంటే ప్రశ్నించారు. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చేయని అరాచకాలు లేవని, ప్రజల్లో బుడ్డాపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అతన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లో లేరన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ.. మహానేత విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడు జంబులయ్య కూటమి కార్యకర్తనేనన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పీపీ మధుసూదన్ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రె డ్డి, మైనార్టీ నాయకుడు యూనుస్ బాషా పాల్గొన్నారు.
బుడ్డా.. నోరు అదుపులో పెట్టుకో!
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని, నోరు అదు పులో పెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. గురువారం శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముందుగానే పథకం ప్రకారం ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేయించారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చే యించారన్నారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్ర హం ధ్వంసం, ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కా ర్యాలయంపై దాడి వెనుక కుట్ర ఉందన్నారు.


