మరిన్ని విజయాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మరిన్ని విజయాలు సాధించాలి

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: విద్యార్థులు ఒక విజయం వద్దే ఆగిపోకుండా, మరిన్ని సాధించాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వా ర్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశంసాపత్రాలు, మెమెంటోలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. పిల్లల విజయాల వెనుక తల్లిదండ్రులు అందించిన సహకారం, ఉపాధ్యాయు ల మార్గదర్శకత్వం అమూల్యమన్నారు.

రూ. 7 కోట్ల టోకరా!

ఎస్పీని ఆశ్రయించిన బాధితులు

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లో మెడికల్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పేరుతో దాదాపు 700 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పద్మావతినగర్‌లో పట్టణానికి చెందిన ముల్లా ఇమ్రాన్‌, వెంకట మధుసాయి, విఘ్నేష్‌లు ఒక బిల్డింగ్‌ అద్దెకు తీసుకున్నారు. సీఆర్‌ కాలింగ్‌ సంస్థ పేరుతో మెడికల్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 700 మంది నిరుద్యోగులను చేర్చుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం మానేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీని కలిసి తమగోడును చెప్పుకుని, కంపెనీ నిర్వాహకులకు తాము ఇచ్చిన నగదు ఇప్పించాలని కోరారు.

శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్‌గా చంద్రశేఖర్‌

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్‌గా చంద్రశేఖర్‌ని దేవాదాయ శాఖ నియమించింది. ఈ మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంద్ర శేఖర్‌ ప్రకాశం జిల్లా మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మాలకొండ దేవస్థానం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

తహసీల్దార్‌, వీఆర్వోపై విచారణ

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తహసీల్దార్‌ రత్నకుమారి, వీఆర్వో వెంకటనరసయ్యపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్లు వైఎస్సార్‌సీపీ మేధావివర్గం కన్వీనర్‌ డాక్టర్‌ శీలం సురేంద్రనాథరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడితో తహసీల్దార్‌, వీఆర్వోలు రికార్డులు పరిశీలించకుండా రామేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి పొలంలో కోయాల్సిన వరి పంటను పక్కనున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అయిన శీలం సుధామణి పొలంలో కోయించడం జరిగిందన్నారు. పక్క పొలంలో కోయడంతో పాటు అందులో 65 బస్తాల దిగుబడి వస్తే కేవలం 35 బస్తాలు వచ్చిందని రికార్డుల్లో నమోదు చేశారన్నారు. దీనిపై తహసీల్దార్‌ను ఎన్ని సార్లు సంప్రదించినా సరైన సమాధానం చెప్పక పోవడంతో జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర భూసర్వే కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో తహసీల్దార్‌, వీఆర్వోలపై విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని స్థానిక ఆర్డీఓకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారని సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

10న జెడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.వి.రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించనున్న సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, పాఠశాల విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్‌ సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement