ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్నంగా టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను గీచి అందరినీ ఆలోచింప చేశారు. పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతవులు స్వేచ్ఛగా ఉన్నట్లు నది జలాలు, నీటిలో నివసించే జలచరాలు ప్రకృతి సోయగాన్ని చూసి వన దేవత సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఒక వైపు.. పర్యావరణ కాలుష్యంతో పచ్చదనం ఎండి వన్యప్రాణులకు నీరు లేక అలమటించి పోయి వన దేవతకు మొరపెట్టుకున్నట్లు చనిపోయిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు చూసి వనదేవత కన్నీరు పెడుతూ చేతులు జోడించి మనుషుల్లారా ఇకనైనా మారండి అంటూ వేడుకుంటున్నట్లు మరో వైపు చిత్రాలు వేశారు.
– నంద్యాల(అర్బన్)


