రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని మునెప్ప నగర్‌లో అక్రమంగా ఓ రేకుల షెడ్‌లో నిల్వ ఉంచిన 56 ప్యాకెట్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం రాత్రి విజిలెన్స్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుడికి చెందిన రేకుల షెడ్‌లో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్‌ పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్‌ సీఐ పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. నందవరం మండలం సోమలగూడూరు మహబుబ్‌బాషాకు చెందిన రేకుల షెడ్‌లో 56 బస్తాలు (24 క్వింటాళ్ల) రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి బియ్యంతో పాటు, రవాణాకు ఉపయోగించే ఆటోను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించి, నిందితుడు మహబుబ్‌బాషాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. సమావేశంలో ఆర్‌ఐ హఫీజ్‌, విజిలెన్స్‌ కానిస్టేబుళ్లు అశోక్‌కుమార్‌, ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement