ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, రోడ్లుకు ఇరువైపుల, వివిధ కార్యాలయాల ఆవరణల్లో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వెల్దుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుంది. విద్యార్థులకు ముందుగానే నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తాం.
– కిశోర్‌కుమార్‌రెడ్డి,
కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి


