వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

దొర్నిపాడు: డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెంది న ఉపాఽధి కూలీ బాలయ్య (34) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాలయ్య రోజులాగే పనులకు వెళ్లి కాలువ పూడికతీత పనుల వద్ద రెండు ఫొటోలు కూడా దిగాడు. 020587 నంబర్‌గల జాబ్‌కార్డు కల్గి ఉన్నాడు. ఇంతలో ఎండతీవ్రతకు తట్టుకోలేక పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే డబ్ల్యూ గోవిందిన్నెలోని ఓ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్త తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య సరోజ ఉన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుబ్బరాయుడు వెంటనే ఎంపీడీఓ సావిత్రి, ఏపీఎం హనీఫాకు విషయం చెప్పగా అనంతరం వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబానికి అధికారులు ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డీసీ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌రెడ్డి కోరారు.

గుండెపోటుతో ఏఎస్‌ఐ శంకర్‌ మృతి

మద్దికెర: మద్దికెర పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఆరిపల్లి శంకర్‌ (58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విధులకు ఇంటి నుండి బయలుదేరే సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే 108 సమాచారం అందించగా వైద్యపరీక్షల కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషన్‌ మృత్యువాత

ఎమ్మిగనూరురూరల్‌: గార్లదిన్నె గ్రామంలో బోరు మరమ్మతు చేసేందుకు వెళ్లిన ఓ ఎలక్ట్రిషన్‌ ప్రమాదవశాత్తూ విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన కురవ లక్ష్మన్న(36) చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గ్రామానికి చెందిన కౌలు రైతు లాజర్‌ పొలంలో బోరు మరమ్మతు చేసేందుకు ఎలక్ట్రిషన్‌ కురవ లక్ష్మన్నను తీసుకెళ్లాడు. విద్యుత్‌ సరఫరా లేదు అనుకొని ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర ఫీజు వేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారులు శ్రీకాంత్‌(10), హరికృష్ణ(8)లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు అందిస్తాం

కోవెలకుంట్ల: ప్రస్తుత ఖరీప్‌ సీజన్‌కు రైతులకు కొరత లేకుండా రసాయన ఎరువులను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కోవెలకుంట్ల ఏడీఏ కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆరు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులను ’ఏపీఏఐఎంఎస్‌’ యాప్‌ ద్వారా పంటల విస్తీర్ణాన్ని బట్టి మూడు విడతలుగా కేటాయిస్తామన్నారు. అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలు, ఎలినినో ప్రభావం, కౌలు కార్డుల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీడీఏ గంగాధర్‌, ఏడీఓ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement