టీడీపీ నాయకుడి రౌడీయిజం! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడి రౌడీయిజం!

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

పేరూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై దాడి

ఓ మహిళకు గాయాలు

రుద్రవరం: అధికారంలో ఉన్నామనే అహంకారం.. దాడులకు పాల్పడటం.. మహిళలను సైతం బెదిరించడం.. రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో ఒక టీడీపీ నాయకుడి రౌడీయిజాన్ని చూసి ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. గ్రామంలో గురువారం వైఎస్సార్‌సీపీ నాయకుడు తిరుపతిరెడ్డి ఇంటిపై టీడీపీ నాయకుడు రామ్‌నాథ్‌రెడ్డి దాడి చేశాడు. తిరుపతిరెడ్డి కోడలిని గాయ పరచాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామంలో టీడీపీ నాయకుడి ఆగడాలకు అంతేలేదు. గత కొద్ది రోజులుగా పేద దళితుడి సాగు భూమిని ఆక్రమించి మట్టి తవ్వకాలు సాగించాడు. మరో రైతు పొలంలో మట్టిని అక్రమంగా తరలించాడు. రైతులందరూ వెళ్లే రహదారి తమ పొలంలో ఉందంటు దున్నేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగించాడు. తాజాగా తిరుపతిరెడ్డి వారి అన్నదమ్ముల పట్టా పొలంలో తన పొలానికి దారి ఉందని మట్టి తోలించాడు. ఇదేమని అడిగి.. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆ మట్టిని తొలగించాడు. ఆ కక్షతో టీడీపీ నాయకుడు వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడి చేశాడు. ఆ దాడిలో ఓ మహిళ గాయపడింది. వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులు రుద్రవరం పోలీస్‌ష్టేషన్‌కు వెళ్లి టీడీపీ నాయకుడు రామ్‌నాథ్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement