నార్మలైజేషన్ పద్ధతితో నాకు ఉద్యోగం రాలేదు. ఎస్‌జీటీలో 75.35 మార్కులు వచ్చినా ఉద్యోగం రాకపోవడానికి కారణం నార్మలైజేషన్. పదేళ్లు కష్టపడి చదివినా నార్మలైజేషన్‌తో 0. 4 పాయింట్లతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. పాత పద్ధతిలో ఒకే రోజు ఒకే పేపర్ విధానంలో డీఎస్సీ పరీక్ష పెట్టింటే నాకు ఉద్యోగం తప్పని సరిగా వచ్చేది.
– శ్రీనివాసులు, నందికొట్కూరు
నేను ఎంఏ, బీఈడ్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డీఎస్సీ–2025 పరీఓలు రాసినా చివరకు ఎంపిక కాలేకపోయా. ప్రస్తుతం డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో నేను బాధపడుతున్నా. ప్రతిభ, కష్టానికి గుర్తింపు దక్కాల్సిన చోట అవకతవకలు జరగడం అన్యాయం. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నా.
– జీ.సాదిక్ బాషా (ఎంఏ., బీఈడ్), వెలుగోడు
●
దగా డీఎస్సీ


