స్వచ్ఛమైన మంచి నీరు ప్రజలకు అందించే మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని స్వలాభం కోసం టీడీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గం. ప్రజలకు అత్యంత ప్రయోజనం కల్గించే ఇలాంటి పథకాలను కూడా ఆదాయపు వనరులుగా చూడడం దురదృష్టకరం. టీడీపీ దుర్మార్గపు పాలనను అంతం చేసే రోజు త్వరలో వస్తుంది.
– పిట్టల జాకీర్, బేతంచెర్ల పట్టణం
టీడీపీ నాయకులు మామూళ్లకు కక్కుర్తి పడి పనులను అడ్డుకున్నారు. లేకపోతే ఈ ఏడాది స్వచ్ఛమైన తాగు నీరు ప్రజలకు అందేది. నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 20 శాతం పనులను కూడా రెండేళ్లల్లో పూర్తి చేయలేకపోవడం టీడీపీ పాలకుల అసమర్ధతకు నిదర్శనం. అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజల గొంతెండుతున్నా పాలకులకు కనికరం లేదు.
– మల్లి రెడ్డి, బేతంచెర్ల పట్టణం
ఈ ఏడాది కూడా వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయకపోవడాన్ని చూస్తే టీడీపీ నాయకుల చిత్తశుద్ధి తేటతెల్లమైంది. కొండమీది పల్లెల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో గుక్కడి నీటి కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజల గోడు పట్టని టీడీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠంనేర్పుతారు. – మెట్టు వెంకటేశ్వరెడ్డి, వైఎస్సార్‌సీపీ
వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి
●


