కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

● రెండేళ్లు గడిచినా టీడీపీ ప్రభుత్వం ఒక్కటీ పూర్తి చేయలేదు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

● రెండేళ్లు గడిచినా టీడీపీ ప్రభుత్వం ఒక్కటీ పూర్తి చేయలేదు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: విపక్ష పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలో చూపే శ్రద్ధ అభివృద్ధి పనులపై టీడీపీ ప్రభుత్వం చూపడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డోన్‌ నియోజకవర్గంలో ప్రారంభించిన కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనుల్లో ఒక్కటి కూడా టీడీపీ ప్రభుత్వం రెండేళ్లయినా పూర్తి చేయలేకపోయిందన్నారు. మంగళవారం ఉదయం దివంగత మాజీ ఎమ్మెల్యే బుగ్గన శేషారెడ్డి మార్గ్‌లో వాకర్స్‌తో కలిసి బుగ్గన గంట పాటు మార్నింగ్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్‌తో మాట్లాడుతూ.. రైల్వే అండర్‌ పాస్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఐటీఐ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, అంబేడ్కర్‌ గురుకుల ఆశ్రమ పాఠశాల భవనాలను మంజూరు చేయించినా టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వ్యయం చేసి నిర్మించిన రిజిస్ట్రార్‌ కార్యాలయం, క్లబ్‌ హౌస్‌, ఎంపీడీఓ కార్యాలయం భవనాలు ప్రా రంభోత్సవానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రెండేళ్లలోనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

కాసేపు చిన్నారులతో..

బుగ్గన మార్గ్‌లోని పాత బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు గత ప్రభుత్వ హయాంలో కి.మీ. పొడవున నిర్మించిన రోడ్డుపై చిన్నారులు స్కేటింగ్‌ చేస్తూ తనను విష్‌ చేయడాన్ని గమనించిన మాజీ మంత్రి బుగ్గన వారి వద్దకి వెళ్లి పలకరించారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్డుపై తాము స్కేటింగ్‌ నేర్చుకుంటున్నామని పలువురు చిన్నారులు బుగ్గనతో అన్నారు. వారి కోరిక మేరకు గ్రూప్‌ ఫొటో దిగారు. బుగ్గన వెంట జిల్లా బీఎల్‌ఏల ఇన్‌చార్జ్‌ ఎద్దుల రాజేంద్రనాథ్‌రెడ్డి, మీట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌ కుమార్‌, పార్టీ జిల్లా వలంటీర్‌ విభాగం అధ్యక్షులు పోస్ట్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ మాజీ ౖచైర్మన్‌ సప్తశైల రాజేష్‌, మాజీ వెస్‌ చైర్మన్‌ జాకీర్‌ హుసేన్‌, పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, యువజన విభాగం నాయకులు ఆర్‌ఈ రాజవర్ధన్‌, క్యాలిటీ అబ్దులా, వంశీ, ఆర్ట్‌ రమణ, రాజా మహేష్‌, చంద్ర, వెంకటేష్‌, రఘురాం తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement