శ్రీశైలం ప్రాజెక్ట్: మలేరియా, డెంగీ, గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా గిరిజన గూడేల్లో ఏసీఎం (ఆల్ఫా సైఫర్ మెత్రిన్) 5 శాతం మందును పిచికారీ చేయాలని సిబ్బందిని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం మలేరియా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నిర్మూలనకు సిబ్బంది పనిచేయాలన్నారు. మలేరియా శాఖ అధికారులు సత్యనారాయణ, కృష్ణారెడ్డి, విజయకుమారి, రామలింగారెడ్డి, సూపర్ వైజర్‌లు పాల్గొన్నారు.
విద్యార్థినికి అభినందన
బేతంచెర్ల: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు గాను 97 మార్కులు సాధించి బుగ్గానిపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థిని చైత్ర జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో ఎంఈఓ –2 అబ్రహం, ఉపాధ్యాయులు, విద్యార్థిని అభినందించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు.
దరఖాస్తు చేసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పనిచేస్తున్న వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్స్ రెగ్యులర్‌కు దరఖా స్తు చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవోనం.7 స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉత్తర్వుల ప్రకారం పెన్షనరీ బెనిఫిట్స్ మంజూరు విషయమై దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కూడిన ధ్రువపత్రాలను ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈనెల 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. గడువు దాటిన తర్వాత స్వీకరించబోవని తెలిపారు.
మరో మూడురోజుల్లో మరమ్మతులు
పాణ్యం: కుంగిన గోరుకల్లు కట్టకు మరో మూడు రోజుల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు ఈఈ భవానీప్రసాద్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వచ్చాయని, రూ. కోటితో మరో మూడు రోజుల్లో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కుంగిన కట్ట ప్రదేశంలో పనుల చేసి నీటి నిల్వకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. రిజర్వాయర్ బండ్ పనులకు సంబంధించి ఆదేశాలు త్వరలోనే ఉన్నతాధికారుల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
నాణ్యతతో విత్తన ప్రాసెసింగ్
నంద్యాల(అర్బన్): అత్యంత నాణ్యతతో విత్తనాలు ప్రాసెసింగ్ చేయాలని విత్తన శుద్ధి కేంద్రాల యజమానులకు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. తన కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకింగ్ చేసే సమయంలో ఒక రకంలో ఇంకోరకం విత్తనాలు కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన రకాలను మాత్రమే ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. కోవెలకుంట్ల ఏడీఏ సుధాకర్, నంద్యాల ఏఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మకాలకు
‘నంద్యాల సోనా’ విత్తనం
నంద్యాల(అర్బన్): స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎన్‌డీఎల్‌ఆర్–7(నంద్యాల సోనా) పునాది విత్తనం అమ్మకాలకు సిద్ధంగా ఉందని ఏడీఆర్ జాన్సన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3 నుంచి 289 క్వింటాళ్ల విత్తనం అమ్మకాలకు సిద్ధంగా ఉంచామని, 25 కేజీల విత్తనం సంచి రూ.1,250తో అమ్మకాలు జరగనున్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలకు 9989625208, 9966665434 నంబర్లను సంప్రదించాలన్నారు.


