ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Jun 2 2026 5:47 AM | Updated on Jun 2 2026 5:47 AM

బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ ఇంటర్‌ విద్యా ర్థిని సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ రమేష్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సుప్రియ (17) ఆదోని మండలంలోని ఆరెకల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రు లు వివాహసంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురై సుప్రియ ఇంటిపైన ఉన్న గదిలో ఫ్యానుకు చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement