శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నిరుద్యోగుల బాధ పట్టడం లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టును మంత్రి లోకేష్ బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది సచివాలయ ఉద్యోగాల ప్రక్రియను ఎటువంటి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించారన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని, అభ్యర్థుల పక్షాన నిలిచి చివరి వరకు పోరాటం చేస్తుందన్నారు.


