పోలీసులు ఎందుకు రాలేదు.. | - | Sakshi
Sakshi News home page

పోలీసులు ఎందుకు రాలేదు..

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

పట్టపగలు.. పట్టణ నడిబొడ్డున దాదాపు 20 నిమిషాలకు పైగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నా కూత వేటు దూరంలో ఉన్న పోలీసులు ఎందుకు రాలేదు అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. జనసేన కార్యకర్త చాకలి జములయ్య దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం తలభాగాన్ని వేరు చేసి చేత్తో పైకెత్తి రాక్షాసానందం పొందడం చూస్తుంటే కూటమి నేతలు ఎంతకు తెగించారో అర్థమవుతుందన్నారు. గత ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీలో కార్యకర్తగా పని చేసిన జంబులయ్య పార్టీ వీడి కూటమి పార్టీలో చేరాడని గుర్తు చేశారు. ఇందుకు సాక్షంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మిడియాలో ప్రచారం చేసుకున్నాడని వివరించారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌తో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో కూడా సోషల్‌ మీడియాలో ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement