వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మగుడి, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్‌, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement