నేలకూలిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు | - | Sakshi
Sakshi News home page

నేలకూలిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

2న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ రాక

బండిఆత్మకూరు: భారీ ఈదురుగాలులకు మండలంలో పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈర్నపాడు, వెంగళరెడ్డి పేట, సోమయాజుల పల్లి పలు గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గాలీవానకు విద్యుత్‌ స్తంభాలు నేలకూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగి పడటంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం నుంచి విద్యుత్‌ అధికారులు మరమ్మతులు చేపట్టారు.

అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(హాస్పిటల్‌): నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌, సోషల్‌ జస్టిస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మెల్విన్‌ జోన్స్‌, సిల్వర్‌జూబ్లీ సెలబ్రేష న్స్‌ ఆఫ్‌ నైస్‌ యూత్‌ ఫర్‌ కల్చర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులకు అవార్డులు అందజేయనున్నట్లు, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయపాటి శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుల విభాగాల్లో భాగంగా 10 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ 10 మంది రక్తదాతలకు ఫాదర్‌ ఆఫ్‌ బ్లడ్‌ గ్రూపింగ్‌ కార్ల్‌ లాండ్‌ స్టైనర్‌ మెమోరియల్‌ అవార్డు,10 కంటే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించిన 10 మంది స్వ చ్ఛంద సేవకులకు ల్యాండ్‌ స్టైనర్‌ బ్లడ్‌ డొనేషన్‌ ఇన్‌స్పిరేషన్‌ అవార్డు, ఉత్త మ స్వచ్ఛంద సేవకులకు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం హ్యూమానిటీ సర్వీ సు అవార్డులకు ఎంపిక చేస్తారన్నారు.ఆసక్తిగల వారు జూన్‌4వ తేదీలోగా సంబంధిత ఫోటోలు,ప్రెస్‌ కటింగ్‌,బయోడేటా వివరాలతో వెంకటరమ ణ కాలనీ మొదటిలైన్‌లో ఉన్న నైస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 93968 61308 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

నంద్యాల(అర్బన్‌): ఈనెల 2న రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ జిల్లాను సందర్శించనున్నారని ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌లో పాల్గొంటారన్నారు. షెడ్యూ ల్‌ కులాలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించదలచిన వారు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వ రకు కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా, డివిజనల్‌, మండల, పో లీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement