మద్దిలేటయ్య కిటకిట | - | Sakshi
Sakshi News home page

మద్దిలేటయ్య కిటకిట

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించడానికి తరలి రావడంతో మద్దిలేటయ్య నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది. ఉప కమిషనర్‌ రామాంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement