కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా | - | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

ఊసేలేని వేరుశనగ విత్తన పంపిణీ

ఖరీఫ్‌లో వేరుశనగ సాగు ఇలా.. 30వేల హెక్టార్లు

వేరుశనగ విత్తన కేటాయింపులు ఇలా..

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. జిల్లాలో ప్రధానంగా వేరుశనగ సాగవుతుంది. నంద్యాల జిల్లాలో డోన్‌, ప్యాపిలి, క్రిష్ణగిరి, నందికొట్కూరు, మిడుతూరు మండలాల్లోనూ వేరుశనగ ప్రధాన పంట. అయితే వేరుశనగ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్‌) విత్తనాలు సరఫరా చేస్తుంది. కొన్నేళ్లుగా ఏపీ సీడ్స్‌లో వేరుశనగ విత్తనోత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్‌ ప్రయివేటు విత్తన కంపెనీలపై ఆధారపడింది. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన వేరుశనగ సరఫరా చేస్తామంటూ 26 ప్రయివేటు విత్తన కంపెనీలు టెండర్లు వేశాయి. 2024–25 ఖరీఫ్‌, రబీ, 2025–26 ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు ఏపీసీడ్స్‌కు సరఫరా చేసిన వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, శనగ విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఏపీ సీడ్స్‌కు చెల్లిస్తేనే కంపెనీలకు చెల్లించే అవకాశం ఉంది. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏపీ సీడ్స్‌కు రూపాయి కూడా విడుదల చేయలేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఇప్పుడు వేరుశనగ సరఫరా చేస్తామంటూ టెండర్లు వేసిన కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ పూర్తి ధర, సబ్సిడీలను పేపరుపై ఖరారు చేసినప్పటికీ కార్యాచరణలో పురోగతి లేకపోవడం గమనార్హం.

హమాలీ చార్జీలు చెల్లించలేని దుస్థితి

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏపీ సీడ్స్‌ నిర్వీర్యమైంది. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ హమాలీల కష్టానికి ప్రతిఫలం కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్‌ చేరుకుంది. సహజంగా వారానికి ఒకసారి నగదు చెల్లిస్తుంటారు. అప్పుడే హమాలీల జీవనం సజావుగా సాగుతుంది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సీడ్స్‌ నిర్వీర్యమవడంతో హమాలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటిసారి ఏప్రిల్‌ నుంచి నుంచి హమాలీలకు చెల్లింపులు నిలిచిపోవడంతో వీరి జీవనం దుర్భరమవుతోంది.

సిబ్బందికి వేతనాలూ కరువే..

2023–24 వరకు వరకు ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ ఒక వెలుగు వెలిగింది. ప్రతి ఏటా మే 15 నాటికే వేరుశనగతో పాటు అన్ని రకాల విత్తనాలను ఏపీ సీడ్స్‌ రైతులకు అందుబాటులోకి తెచ్చేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కార్మికులకు రూపాయి కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్‌ను తీసుకొచ్చింది. హమాలీలకే కాదు డైలీ వేజ్‌పై పనిచేసే వారికి కూడా ఏప్రిల్‌ నుంచి వేతనాల్లేవు. కనీసం కరెంటు బిల్లులూ చెల్లించలేని దయనీయం నెలకొంది. ఏప్రిల్స్‌ నెల విద్యుత్‌ బిల్లులు ఇంతవరకు చెల్లించలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా చెల్లించకపోవడం గమనార్హం.

సర్టిఫికేషన్‌, ట్యాగ్‌లు వచ్చేది ఎప్పుడో!

టెండర్లు వేసిన కంపెనీల దగ్గర

క్వింటా వేరుశనగ కూడా లేదు.

బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంది.

కర్నూలు జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ

పంటే లేదు.

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి 150 క్వింటాళ్లు, ఆదోని మార్కెట్‌కు 15 క్వింటాళ్లు, ఎమ్మిగనూరు మార్కెట్‌కు 50 క్వింటాళ్ల లోపు మాత్రమే వస్తోంది.

టెండర్లు వేసిన కంపెనీలు ఇతర జిల్లాల్లో కొనుగోలు చేయాలి.

ఈ ప్రక్రియ మొదలే కాలేదు. కొనుగోలు చేసిన దానిని ప్రాసెసింగ్‌ చేసి.. ప్యాకింగ్‌ చేయాల్సి ఉంది.

లాట్‌ల వారీగా శాంపుల్స్‌ తీసి సర్టిఫికేషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ విత్తన ధృవీకరణ

సంస్థకు పంపాలి.

అక్కడ మొలక శాతం, స్వచ్ఛత తదితరాలను పరిశీలించి సర్టిఫికేషన్‌తో పాటు ట్యాగ్‌లు ఇవ్వడానికి 10 రోజులకుపైగా సమయం పడుతుతుంది.

టెండర్లు వేసిన కంపెనీలు ఇప్పటికప్పుడు వేరుశనగ కొనుగోలు చేపట్టినా రైతులకు పంపిణీ చేయడానికి కనీసం 20 రోజులు పడుతుంది.

దీన్నిబట్టి చూస్తే ఈ సారి సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేసే ఉద్దేశం లేదని

అర్థమవుతోంది.

చంద్రబాబు ప్రభుత్వంలో

నిర్వీర్యమైన ఏపీ సీడ్స్‌

సరఫరాకు 26 విత్తన కంపెనీల

టెండర్లు

ఇప్పటి వరకు

అందుబాటులో లేని వేరుశనగ

ఖరీఫ్‌ మొదలవుతున్నా చలనం కరువు

ముందుగా పాత బకాయిలు

చెల్లించాలని మెలిక

15వేల హెక్టార్లు

10,723 క్వింటాళ్లు

2,136 క్వింటాళ్ల

Advertisement
 
Advertisement
Advertisement