స్వాతి మహోత్సవం.. అహోబిలేశుడి వైభవం | - | Sakshi
Sakshi News home page

స్వాతి మహోత్సవం.. అహోబిలేశుడి వైభవం

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

ఆళ్లగడ్డ: స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించా రు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ము గించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలంకరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభ య దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement