టీడీపీ కార్యాలయమా.. టీటీడీ కల్యాణ మండపమా? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయమా.. టీటీడీ కల్యాణ మండపమా?

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

టీడీపీ నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం

డోన్‌: ఆధ్యాత్మిక కేంద్రాలను, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపాలను సైతం టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారు. ఇందుకోసం పసుపు జెండాలతో అలంకరిస్తున్నారు. ఉడుములపాడులోని టీటీడీ కల్యాణ మండపాన్ని ఇలా చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రవిత్ర స్థలాలను సైతం పార్టీ ప్రచార కేంద్రాలుగా మార్చడంపై మండిపడ్డారు. ఇంధన పొదుపు బాధ్యత అంటూ నెల్లూరులో నిర్వహించే టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు వీక్షించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో పది క్లస్టర్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఉడుములపాడులోని టీటీడీ కల్యాణ మండపంలో డిజిటల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement