మల్లన్న హుండీ ఆదాయం రూ.5.28 కోట్లు | - | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.5.28 కోట్లు

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానం ఉభయ దే వాలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.5,28,37,281 లభించినట్లు కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవా రం అలంకార మండపంలో హుండీ కానుకలను లెక్కించారు. గత 33 రోజుల్లో భక్తులు ఈ ఆదాయాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పించారన్నా రు. అలాగే బంగారం–96.500 గ్రాములు, వెండి–3.780 కేజీలు లభించిందన్నారు. అలాగే కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్దిని, పలు విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థాన సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

అన్నదాన పథకానికి

రూ.2లక్షల విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తు న్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.2 లక్షల విరాళాలు సమర్పించారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన సచిన్‌ కుమార్‌ దేవరెడ్డి రూ.లక్ష, కర్నూలుకు చెందిన కె.నాగరాజు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని అందించి సత్కరించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్ష వాయిదా

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 28వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ ఎకనామిక్స్‌ పేపర్‌–1, మ్యాథ్స్‌–2బీ పరీక్షలను బక్రీద్‌పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి శంకర్‌నాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు జరగాల్సిన పరీక్షను జూన్‌ 5న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌డీఓలకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆదేశాల మేరకు 26, 27వ తేదీన ఆన్సర్‌ బుక్స్‌ పరీక్షలు సంబంధిత పోస్టాఫీసుల్లో బుక్‌ చేయాలన్నారు. పరీక్షలు లేకపోయినప్పటికీ తమ పరీక్షా కేంద్రాలకు హాజరై జరిగిన పరీక్షలకు సంబంధించి ఆన్సర్‌ బండిల్స్‌ను కచ్చితంగా పోస్టాఫీసులో డిపాజిట్‌ చేయాలన్నారు. తేదీల ప్రకారం ట్రంక్‌ బాక్సుల్లో ఉన్న ప్రశ్నాపత్రాలను డివైజ్‌గా సక్రమంగా సర్దుబాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

లోన్‌ యాప్స్‌తో

యువత జాగ్రత్త

బొమ్మలసత్రం: రుణాలు పొందేందుకు నిషేధిత లోన్‌ యాప్స్‌లో యువత వ్యక్తిగత వివరాలు నమో దు చేస్తే అది చాలా ప్రమాదమని జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మంగళవారం ప్రకటన ద్వారా హెచ్చరించారు. యువత అవసరాలను ఆసరాగా చేసుకుని తక్షణమే లోన్‌ ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నకిలీ ఏపికే ఫైల్స్‌ను ఓపెన్‌ చేయవద్దని, అ లాగే ఆర్‌టీవో ఈ చలానా, వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ లాంటి మెస్సేజ్‌లు తెరవద్దని హెచ్చరించారు. ఈలింక్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఆర్ధిక నేరాల కు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా గురై ఉంటే వెంటనే 112, 100 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సబ్‌జైలు తనిఖీ

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్‌ జైలు ను ఉమ్మడి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జై లు పరిసరాలను, వంట, స్నానపు గదులు, జైలు గదులను, పరిశీలించారు. అనంతరం ఖైదీల ఆరోగ్య విషయాలు, వారి నేర వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామన్నారు. అదే విధంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ గురుప్రసాదరెడ్డి, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, పారా లీగల్‌ న్యాయవాది బాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement